పోలింగ్‌ వ్యవధి తుది నిర్ణయం ఈసీదే

న్యూఢిల్లీ : రంజాన్ ఉపవాసాల కారణంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వ్యవధి తగ్గింపు గురించి కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని అత్యున్నత న్యాయ స్థానం గురువారం ప్రకటించింది. రంజాన్ ఉపవాసాల వల్ల మిగిలిన మూడు దశల పోలింగ్‌ను ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్ధాన్తో సహా పలు రాష్ట్రాల్లో వడ గాడ్పులు వీస్తున్నందున పోలింగ్‌ సమయాన్ని తగ్గించాలని కోరారు. వచ్చే ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ ఉపవాసాలు ఆరంభం కానున్నాయి. మూడు విడతల పోలింగ్‌ మే 6, 12, 19 తేదీల్లో జరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos