న్యాయాన్ని ప్రతి గడపకు చేర్చాలి

న్యాయాన్ని ప్రతి గడపకు చేర్చాలి

న్యూ ఢిల్లీ : ఈ దేశంలో చాలా మంది ప్రజలు న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి విజ్ఞాన్ భవన్లో శనివారం తొలిసారిగా జరిగిన జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశంలో ప్రసంగించారు. ‘న్యాయ ప్రక్రియలో చాలా మంది ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే. న్యాయ స్థానాలపై ప్రజల అభిప్రాయం.. జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుంచి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో న్యాయవ్యవస్థలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలగాలి. అలా చేర్చగలిగితే మనమంతా న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలపాలి. దేశ నిజమైన బలం యువతలోనే ఉంది. ప్రపంచంలో ఐదో వంతు యువత మన దేశంలోనే ఉంది. అయితే మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. మిగతావారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలి’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos