‘ మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి గురించి ఆలోచించుకోండి’

‘ మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి గురించి ఆలోచించుకోండి’

హైదరాబాదు: ‘నిన్నటి పరిణమాలను చూస్తుంటే బాధేస్తోంద’ని భువనేశ్వరి సోదరుడు నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నందమూరి కుటుంబం దేవాలయం లాంటిది. మా కుటుంబంపైకి రావడాన్ని సహించబోము. మా ఆడ పడుచుకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదన్నారు. ఎవరి పేర్లను తీసుకు రావద్దనుకున్నా పరిస్థితి తప్పట్లేదు. ఒరేయ్ నానిగా.. ఒరేయ్ వంశీగా.. అంబటి రాంబాబు.. ఒరేయ్ .. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీరు  హద్దు మీరిపోయారు. ఇక పై జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి గురించి ఆలోచించుకోండి. మా కుటుంబం మీద కొస్తే మాత్రం బాగుండదు. రాజకీయంగా ఉంటే చూసుకోండి. వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. ఇక్కడ ఎవరూ చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. మాకు క్రమశిక్షణ అలవర్చారు. అందుకే సహనంతో ఉంటున్నాం’అన్నారు.నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని భువనేశ్వరి సోదరి లోకేశ్వరి అన్నారు. ‘అసెంబ్లీ దేవాలయం. కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి అపవిత్రం చేస్తున్నారు. చంద్రబాబు అంతలా ఏడుస్తుంటే చూడలేకపోయావ. నా చెల్లెలిని అవమానించడం బాధగా అనిపించింది. జగన్ తల్లి, భార్య, చెల్లిని ఏనాడూ చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎవరినీ అననివ్వలేదు. మళ్లీ తమ కుటుంబ సభ్యులను ఇలాంటి రాజకీయాల్లోకి లాగకూడదు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తమ మరో అవతారం చూడాల్సి వస్తుంద’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos