టీచర్ అంటూ పిల్లాడు ఫిర్యాదు చేసినట్లు ఉంది

టీచర్ అంటూ పిల్లాడు ఫిర్యాదు చేసినట్లు ఉంది

ముంబై: బాలీవుడ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నటులు కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించటం ఉపాధ్యాయులకు విద్యార్థి చేసిన ఫిర్యాదులా ఉందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంగళవారం ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. కరణ్ జొహార్, యశ్ రాజ్, అనిల్ కపూర్, అజయ్ దేవ్గన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కు చెందిన సంస్థలు సహా 38 నిర్మాణ సంస్థలు వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. రిపబ్లిక్ టీవీ అధిపతి అర్ణబ్ గోస్వామి, ప్రదీప్ భండారి, టైమ్స్ విలేఖరులు రాహుల్ శివ శంకర్, నావికా కుమార్లు బాలీవుడ్పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసినట్లు వ్యాజ్యాంలో ఆరోపించారు. ‘చాలా ఆలస్యంగా, చాలా తాపీగా బాలీవుడ్ ప్రతి స్పందించింది. ఢిల్లీ హైకోర్టులో సినీ రంగ ప్రముఖులు ఫిర్యాదు చేయడం.. బడి పిల్లాడు తమ టీచర్ వద్దకు వెళ్లి ‘టీచర్ టీచర్ ఆ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నాడు టీచర్’ అని చెప్పినట్లు ఉంద’ని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos