ఇంటిపేరు అల్లూరి… సాకింది గోదారి..

  • In Film
  • March 27, 2020
  • 183 Views
ఇంటిపేరు అల్లూరి… సాకింది గోదారి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కాస్తంత ఆలస్యమైనా పక్కా బర్త్ డే గిఫ్ట్ దొరికింది. రాజమౌళి సినిమా అసలు సిసలైన స్టయిల్ ను పరిచయం చేస్తూ ‘రౌద్రం రణం రుధిరం’ నుంచి అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. మూడింటిలోనూ ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు.”ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే చావుకైనా చెమటలు ధారకడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న… మన్నెం దొర… అల్లూరి సీతారామరాజు” అంటూ ఎన్టీఆర్ పరిచయం సాగింది.ఇక ఇందులో రామ్ చరణ్ కసరత్తులు, ధ్యానం చేయడం తుపాకి, బాణాలను ప్రయోగించడం వంటి దృశ్యాల కట్స్ కనిపిస్తున్నాయి. విడుదలైన రెండు నిమిషాల వ్యవధిలోనే తెలుగు వర్షన్ వ్యూస్ లక్ష దాటింది. తమిళ్, హిందీ, కన్నడ, మళయాల భాషల్లోనూ ఇదే ఫస్ట్ లుక్ విడుదలైంది.దీనిపై నిన్నటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ హడావుడి మొదలుపెట్టాడు. చరణ్ రేపు నీకు మర్చిపోలేని డిజిటల్ గిఫ్ట్ ఇస్తానంటూ ఊరించాడు. ఇవాళ ఉదయం మరలా, అయ్యో చరణ్ ఆ గిఫ్ట్ రాజమౌళి వద్దకు చేరిందంటూ ఉడికించాడు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సైతం రంగప్రవేశం చేసి మరీ ఇంత నిరాశకు గురిచేస్తారా అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తన మాట నిలుపుకున్నాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ, “నేను మాటిచ్చిన విధంగా ఇదిగో నా కానుక. అందుకో రామ్ చరణ్! హ్యాపీ బర్త్ డే బ్రదర్. మన అనుబంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలి” అంటూ ట్వీట్ చేశాడు.ఇదిలా ఉండగా తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఎన్టీఆర్ .. చరణ్ తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పనున్నారనేది తాజా సమాచారం. అంటే తమిళ .. హిందీ వెర్షన్లలో ఎన్టీఆర్ .. చరణ్ వాయిస్ లే వినిపించనున్నాయన్న మాట. దీనిని బట్టి ఎన్టీఆర్ .. చరణ్ లకు తమిళ .. హిందీ భాషలపై కూడా మంచి పట్టు ఉందని అర్థమవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, లాక్ డౌన్ ఎత్తివేయగానే మొదలవుతుందని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos