యాంకర్ ఝాన్సీకి రకుల్‌ ప్రీత్ సింగ్ లిప్‌లాక్‌?

  • In Film
  • August 8, 2019
  • 151 Views
యాంకర్ ఝాన్సీకి రకుల్‌ ప్రీత్ సింగ్ లిప్‌లాక్‌?

కింగ్‌ నాగార్జున-రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన మన్మథుడు 2 చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.ఓ ఫ్రెంచ్‌ చిత్రానికి రీమేక్‌గా తెలుగు నేపథ్యానికి తగ్గుట్లు మార్పలు చేసి రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌తో చిత్రంపై అంచనాలు నెలకొనగా చిత్రంలో ముద్దు సన్నివేశాలు అంచనాలను మరింత పెంచాయి.తాజాగా చిత్రానికి సంబంధించి బయటకు వచ్చిన సెన్సార్‌ రిపోర్టులో హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు చిత్రంలో ఓ పాత్రలో నటించిన యాంకర్‌ ఝాన్సీకి మధ్య కూడా లిప్‌లాక్‌ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం.. రెండు సీన్లను బ్లర్ చేశారు. అలాగే, ఆరు చోట్ల డైలాగులను మ్యూట్ చేశారు. వీటితో పాటు మద్యం సేవించే సందర్భంలో హెచ్చరికలు వేశారు. బ్లర్ చేసిన రెండు సీన్లలో ఒకటి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. సహ నటి ఝాన్సీకి లిప్ లాక్ ఇచ్చిన సీన్ అని రాసి ఉంది. ఇది బయటకొచ్చినప్పటి నుంచి అందరూ షాక్ అవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos