ప్రజలు కూడా బాధ్యులే…

ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్శిటీల జాబితాలో ముందువరుసలో ఉంటే
హార్వర్డ్‌ యూనివర్శిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించే అవకాశం దక్కడంపై చాలా సంతోషంగా ఉందంటూ
దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు.యూనివర్శిటీలో విద్యార్థులతో ప్రసంగించిన అనంతరం సినీ
ప్రస్థానం మొదలైన అనుభవాలు పంచుకున్నారు.సినీ ప్రస్థానం మొదలు కాక ముందు శాంతినివాసం
అనే ధారావాహికకు దర్శకత్వం వహించామని ఆ సమయంలో చిత్ర పరిశ్రమలో ఇంతటి స్థాయికి వస్తామని
ఊహించలేదన్నారు.చేసిన ప్రతీ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దడానికి తీవ్రంగా
శ్రమించానని ఒక్కో చిత్రానికి వైవిధ్యాన్ని చూపడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంతటి స్థాయికి
చేరుకోగలిగానని బావిస్తున్నామన్నారు.తమ దృష్టిలో అంతర్జాతీయ స్థాయి సినిమాలు అంటూ ఏవీ
ఉండవని ఏ భాషలోనైనా ఎమోషన్స్‌ను బలంగా చూపించగలిగితే చాలని తాను ప్రధానంగా వీటిపైనే
దృష్టి సారిస్తానన్నారు. బాహుబలి సినిమా జపాన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిందేమీ
కాదు. కానీ అక్కడ మంచి ఫలితాలు సాధించిందని రాజమౌళి అన్నారు.గతంలో జేపీగారి
వెంట నడిచినపుడు ప్రజలంతా మంచివారు, పొలిటీషియన్స్ అంతా చెడ్డవారు అనే భావన ఉండేదని
మంచి రాజకీయనేతలను ఎన్నుకుంటే మొత్తం అంతా మారిపోతుంది అనుకునేవాడిని. తర్వాత నాకు
అర్థమైంది పొలిటీషియన్స్ అంతా చెడ్డవారు కాదు. ఇప్పుడున్న పరిస్థితులకు పొలిటీషియన్స్
ఎంత బాధ్యులో, ప్రజలు కూడా అంతే బాధ్యులు. డబ్బులు తీసుకుని ఓటేసినపుడు మనం పొలిటీషియన్లను
బ్లేమ్ చేయడానికి ఏమీ ఉండదు. అదొక్కటనే కాదు చాలా కారణాలు ఉన్నాయని రాజమౌళి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos