రాహుల్ గాంధీని ఎత్తుకున్న మొదటి వ్యక్తి

రాహుల్ గాంధీని ఎత్తుకున్న మొదటి వ్యక్తి

వయ్‌నాడ్: జీవితం ఒక్కో సారి ఆశ్చర్యకరమైన , అసాధారణ అనుభవాలకు ప్రతీ్క అవుతుంది. దానికి సాక్షి విశ్రాంత స్టాఫ నర్సు రాజమ్మ వవాతిల్(72). కేరళ , వయనాడ్‌కు చెందిన ఈమె ఢిల్లీ హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి ప్రసూతి విభాగంలో విధుల్నినిర్వర్తించారు. లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జన్మించినప్పుడు లేబర్ రూమ్‌లో పని చేశారు.‘ 48 ఏళ్ల కిందట నేను చేతులతో ఎత్తుకున్న బిడ్డ రాహుల్ గాంధీ వయనాడ్ వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు’ అని రాజమ్మ ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ యూపీలోని అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీకి దిగటంతో వయనాడ్ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని రాజమ్మ గుర్తు చేసుకున్నారు. రాహుల్ జన్మించినప్పుడు ఆమెకు 23 ఏళ్లు. నర్సింగ్‌లో డిగ్రీ చదివిన తర్వాత ఆమె హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేరారు. గాంధీ కుటుంబంలోకి రాబోతున్న కొత్త సభ్యుడు కావడంతో అప్పుడు తామంతా లేబర్ రూమ్‌లో విశేష ఆసక్తితో ఎదురు చూసినట్టు చెప్పారు. ‘అది 1970 జూన్ 19 అనుకుంటా ప్రధానమంత్రి మనవడు జన్మించడంతో మేమంతా ఎలాంటి ఉద్వేగంతో నిండిఉంటామో మీరు ఊహించుకోవచ్చు. అందరూ సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలారు. రాహుల్ చూడముచ్చటగా ఉండడంతో అందరూ తమ చేతుల్లోకి తీసుకుని మురిసి పోయారు. ఆయన తల్లిదండ్రులకంటే ముందు మేమే ఆయనను చూశాం..’’ అని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశా రు . సోనియా గాంధీ ఆస్పత్రి నియమాలకు కట్టుబడి సహకరించారని రాజమ్మ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లతో కూడా తమకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వలేదన్నారు. ‘‘సోనియా గాంధీకి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం నేను ప్రసూతి గదిలోకి వెళ్లి ఆమెను కలుసుకున్నాను. ఆమె చక్కగా సహకరించారు. సాధారణ కాన్పు అయ్యింది. మా బృందంలో నర్సులు, పీడియాట్రిషియన్లు, వైద్యులు ఉన్నారు.’ అని గుర్తు చేసుకున్నారు. ప్రసూతి గదిలో ప్రవేశించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అనుమతి ఇచ్చినా రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు బయటే నిలబడి వేచిచూశారన్నారు. అప్పుడా ఇద్దరూ తెల్లటి కుర్తాలు ధరించి ఉన్నారంటూ పాట్నా పర్యటనలో ఉన్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ మూడు రోజుల తర్వాత మనవడిని చూడడానికి వచ్చారన్నారు.

కొన్నేళ్లకు అహ్మదాబాద్‌లో ఆర్మీకి సేవలు చేసిన రాజమ్మ1987లో కేరళకు తిరిగివచ్చారు. రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడం ఆనందాన్ని ఇచ్చినా ఎన్నికల ప్రచారంలో తన ‘‘మనవడిని’’ కలుసుకోలేక పోయినందుకుబాధగా ఉందన్నారు. ‘సాధ్యమైనంత త్వరగా నేను ఆయనను కలుసు కోవాలనుకుంటున్నాను. ఆయనతో నేను చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. తన నానమ్మ, తల్లి కూడా ఈ విషయాలు ఆయనతో చెప్పలేదనుకుంటా. నువ్వు ఎలా జన్మించావు… నీ కళ్లు తెరిచినప్పుడు ఎవరు నిన్ను ముందుగా చూశారు, ప్రధాని మనవడైన నిన్ను మేమంతా ఎలా పిలుచుకున్నాం. ఇలాంటి విశేషాలెన్నో ఆయనతో పంచుకోవాలి.’ అని పేర్కొన్నారు. ఇంతకీ మీరు రాహుల్‌కే ఓటు వేశారా అని ప్రశ్నించగా ‘నా మనవడికి ఓటు వేయకపోతే నేను ఇంకెవరికి ఓటు వేస్తాను? అని చిరునవ్వు నవ్వారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచి తీరతారనీ… తదుపరి ప్రధానమంత్రి ఆయనే కావాలని ఆకాంక్షించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos