మూడు రోజుల్లో భారీ వర్షాలు

మూడు రోజుల్లో భారీ వర్షాలు

విజయ వాడ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయు గుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుం దని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ఆంధ్రాకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఈ అల్పపీడనం త్వరితగతిన తన దిశను మార్చుకుంటూ వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కోస్తా ఆంధ్రాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos