హొసూరు రైతులకు భారీ నష్టం

హొసూరు రైతులకు భారీ నష్టం

హొసూరు : కృష్ణగిరి జిల్లా హొసూరు ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షానికి తోడు పెను గాలులకు గ్రీన్ షెడ్లు, అరటి చెట్లు నేలకొర గడంతో రైతులు భారీగా నష్టపోయారు. వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకొరిగాయి. అప్పులు చేసి పెట్టిన పంటలు కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయామని హోసూరు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  హోసూరు ప్రాంతంలోని సూలగిరి, బాగలూరు,కెలమంగలం, తళి తదితర ప్రాంతాలలో గ్రీన్ షెడ్లు,  అరటి తోటలు నేలకొరిగాయి. రూ.కోట్లు విలువచేసే పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని హొసూరు ప్రాంత రైతులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos