మ‌రో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు

మ‌రో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు

హైదరాబాదు: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొన‌సాగుతున్న‌ద‌ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ద్రోణి అల్పపీడనంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. దీంతో ద‌క్షిణ భార‌తంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని అధికార్లు వివరించారు. వ‌ర్గాలు ఉత్తరాది మీదుగా తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 3-4 రోజుల పాటు కొనసాగనుంది. దరిమిలా ఆగష్టు 11 వరకు పశ్చిమ బెంగాల్‌లో గంగా నదిపై భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన విస్తృత వర్షపాతం చాలా ఎక్కువగా న‌మోద‌వుతుంద‌ని వాతావరణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos