ప్రారంభమైన ఆన్‌లైన్‌ బుకింగ్‌

ప్రారంభమైన ఆన్‌లైన్‌ బుకింగ్‌

న్యూ ఢిల్లీ : జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లకు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్లో ఉదయం పది గంటల నుండి బుక్ చేసుకో వచ్చని రైల్వే శాఖ గురువారం ఇక్కడ ప్రకటించింది. రైళ్లు బయలుదేరే వేళకు రెండు గంటల ముందు వరకూ టిక్ట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా 30 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. వెయిటింగ్ లిస్ట్ లికెట్ ఉన్నా రైల్వే స్టేషన్లోకి ప్రవేశం లేదు. రైల్లో ఖాళీ సీట్లు ఉన్నా కేటాయించే అధికారం టిసికి ఉండదు. తత్కాల్, ప్రీమియం రైల్ టికెట్లకు అవకాశం లేదు. ప్రయాణానికి నాలుగు గంటల ముందు ఖరారైన టికెట్ల జాబితాను వెల్లడిస్తారు. 90 నిమిషాల ముందు రైల్వేస్టేషన్కు చేరుకోవాలి. మాస్కులు, శానిటైజర్ వంటివి తప్పనిసరి. అన్ని స్టేషన్స్లోనూ ఆహార శాలలు తెరచి ఉంటాయి. పార్సిల్స్కు మాత్రమే అనుమతిస్తారు. జూన్ 1 నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్ప్రెస్ వంటి 200 రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. నాన్- ఎసి, ఎసి తరగతులుం టాయి. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ ధరలు మామూలుగానే ఉంటాయని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos