బీజేపీ గుప్పిట్లో ఈడీ, సీబీఐ, ఐటీ

బీజేపీ గుప్పిట్లో ఈడీ, సీబీఐ, ఐటీ

న్యూ ఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ పరిశీలకుల తరహాలో తాను భవిష్యత్ను ఊహించలేనని, మీడియా అంచనాలకు అందని విధంగా ఈసారి ఎన్నికల్లో నువ్వానేనా అనేలా పోటీ ఉంటుందని చెప్పగలనని అన్నారు. రాహుల్ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ వెలిగిపోతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఈసారి అంతకుమించి ప్రచారార్భాటం చేస్తున్నారని అన్నారు. వాజ్పేయి హయాంలో ఇండియా షైనింగ్ అని ప్రచారంతో ఊదరగొట్టినా ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ధ్వంసం చేసేవారికి నిర్మించే వారికి మధ్య పోటీ జరుగుతుందని రాహుల్ అభివర్ణించారు. బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతకుముందు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విడుదల చేశారు. పేదలు, మహిళలకు, విద్యార్ధులకు ఏడాదికి రూ. లక్ష అందిస్తామని, రైతు రుణమాఫీ చేపడతామని, కులగణన చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos