వేధింపులే కారణాలు …

  • In Crime
  • February 13, 2019
  • 153 Views
వేధింపులే కారణాలు …

బుల్లితెరె వర్ధమాన నటి నాగఝాన్సీ ఆత్మహత్య వెనుక దాగున్న కారణాలు,రహస్యాన్ని పంజగుట్ట పోలీసులు చేధించారు.ఝాన్సీ ప్రేమికుడు సూర్యతేజ వేధింపులు,అనుమానాలే ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు తేల్చారు..పంజగుట్ట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..విజయవాడ నగరంలో చరవాణి దుకాణం నిర్వహించే సూర్యతేజకు గత ఏడాది ఏప్రిల్‌లో స్నేహితుల ద్వారా నాగఝాన్సీ పరిచమయ్యారు.ఇరువరి మధ్య ఏర్పడ్డ పరిచయం అనతి కాలంలోనే ప్రేమగా రూపాంతరం చెందింది.తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలియజేసిన ఝాన్సీ అతడినే వివాహం చేసుకుంటానని స్పష్టం చేయడంతో అందుకు ఝాన్సీ తల్లి కూడా అంగీకరించారు.గత ఏడాది ఆగస్ట్‌ నెలలో సూర్యతేజ ఇంటికి వెళ్లిన ఝాన్సీ వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు.గత ఏడాది నవంబర్‌ నెలలో సూర్యతేజ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన బైకును కూడా ఝాన్సీ కానుకగా ఇచ్చారు.గతనెల27వ తేదీన మరోసారి హైదరాబాద్‌లోనున్న ఝాన్సీ ఇంటికి వెళ్లిన సూర్య మరోసారి వివాహం గురించి ఝాన్సీ తల్లితో చర్చించాడు.మీ తల్లితండ్రులను ఒప్పిస్తేనే వివాహం చేస్తామని ఝాన్సీ తల్లి స్సష్టం చేయగా తన తల్లితండ్రులను ఒప్పించే బాధ్యత నాదేనని అయితే ఝాన్సీ నటన మానేస్తేనే తన తల్లితండ్రులు వివాహానికి అంగీకరిస్తారంటూ షరతు విధించాడు.అందుకు అంగీకరించిన ఝాన్సీ నటకు స్వస్తి పలికి బ్యూటీపార్లర్‌ నిర్వహించసాగారు.అయితే అప్పటికే ఒప్పందుకు కుదుర్చుకున్న కొన్ని ధారావాహికల్లో మాత్రం నటిస్తుండేవారు.అప్పటి నుంచి సూర్యతేజలో అనుమానపు రాక్షసుడు మేల్కొన్నాడు.తరచూ ఝాన్సీని అనుమానిస్తూ ఎవరితో కొద్ది నవ్వుతూ మాట్లాడినా,ఫోన్‌లో ఎవరితో మాట్లాడినా వేధించేవాడు. ఒక దశలో కావాలనే ఆమెను నిర్లక్ష్యం చేయడం, ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టడం చేశాడు. ఈ పరిణామాలను ఆమె తట్టుకోలేకపోయింది. ఆత్మహత్యకు ముందు ఐదు రోజులపాటు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె, వీటి గురించే ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ సమయంలోనే సూర్యతేజ మరొకర్ని పెళ్లిచూపులు చూసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకుని మరింత కుంగిపోయింది. ఈ నెల 5న ఆత్మహత్య చేసుకుంది’’ అని ఎస్సై చంద్రశేఖర్‌ వెల్లడించారు.
మగా మాట్లాడటం..వెంటనే చిర్రుబుర్రులాడటం..తెలిసిన వాళ్లతో సన్నిహితంగా ఉన్నా అనుమానించడం..ఇకపై మాట్లాడనంటూ మొహం చాటేయడం..ప్రాణంగా భావించిన నటనకు దూరంగా ఉండాలంటూ ఆంక్షలు విధించడం..ఇన్ని వేధింపులు భరిస్తున్నా ప్రియుడు మరొకర్ని పెళ్లిచూపులు చూసేందుకు సిద్ధమవడం వంటి పరిణామాలు బుల్లితెర నటి నాగఝాన్సీ ఆత్మహత్యకు కారణమని పంజాగుట్ట పోలీసులు తేల్చారు.ప్రేమిస్తున్నట్లు నటించి వేదనకు గురిచేయడం, నమ్మక ద్రోహం చేయడం, అన్నింటినీ మించి అతని వల్ల తనకు ఎంతో ఇష్టమైన నటనకు దూరమవడం వంటి పరిణామాలు ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పాయని, నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos