కూలీ మెడను చుట్టేసిన కొండచిలువ

కూలీ మెడను చుట్టేసిన కొండచిలువ

తిరువనంతపురం : పొదల్లో చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తున్న కూలీలకు కొండచిలువ భయబ్రాంతులను చేసింది. అమాంతం ఓ కూలీ మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. నెయ్యార్ డ్యామ్ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేయడానికి కొంత మంది కూలీలు మంగళవారం అక్కడికి వెళ్లారు. భువనచంద్రన్ నాయర్ అనే వృద్ధుడికి అక్కడ కొండచిలువ కనిపించింది. దీంతో నెమ్మదిగా దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా, అది ఒక్కసారిగా అతడి మెడను చుట్టేసింది. అంతకంతకు పట్టు బిగిస్తూ అతడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించింది. సమీపంలో పనిచేస్తున్న మరికొంత మంది కూలీలు వెంటనే అప్రమత్తమై నాయర్ పరిస్థితి చూసి బెంబేలెత్తిపోయారు. అనంతరం ధైర్యం కూడదీసుకుని కొండచిలువ మూతి బిగించి ఎలాగోలా దానిని నాయర్ మెడపై నుంచి లాగి పడేశారు. అనంతరం దానిని అటవీ అధికారులకు అప్పగించగా, వారు అడవిలో వదిలేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos