పూరి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

పూరి భక్తుల కోసం ప్రత్యేక  రైళ్లు

భుభనేశ్వర్‌: ఫోని తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ఒడిశా రాష్ట్రం, సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం పూరిలో ఉన్న భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు గురువారం రైల్వేఅధికారులు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా 103 రైళ్లు రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. దీంతో పూరి నగరంలో పెద్ద ఎత్తున పర్యాటకులు నిలిచిపోయారు.పూరి పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. తీవ్ర పెనుతుపాను గండం పొంచి ఉన్న నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒడిశా సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.దరిమిలా గురువారం మధ్యాహ్నం పూరి నుంచి ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, జైపూర్, కేందుఝర్ రోడ్డు, భాద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా షాలిమార్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos