ఆన్‌లైన్‌ వ్యాపారంపై వర్తకుల ఆందోళన

ఆన్‌లైన్‌ వ్యాపారంపై వర్తకుల ఆందోళన

హొసూరు : దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ  హొసూరులోని చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్, వాల్‌మార్ట్‌ తదితర సంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వ్యాపారం వల్ల దేశ వ్యాప్తంగా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రామ్‌ నగర్ వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో వ్యాపారులు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల సంఘం  హొసూరు అధ్యక్షుడు భాగ్యరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ తదితర సంస్థల ఆన్‌లైన్‌ వ్యాపారం వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక వెంటనే ఆన్‌లైన్ వ్యాపారాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos