మార్కెట్లకు భారీ లాభాలు

మార్కెట్లకు భారీ లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్ని గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగ బాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఝేంజ్ నిఫ్టీ 12,200 మార్క్ పైన నిలిచింది. కొనుగోళ్లతో ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు అంత కంతకూ జోరు పెంచాయి. ఒక దశలో సెన్సెక్స్ 41,600 మార్క్ను దాటింది. చివరకు 411 పాయింట్లు లాభపడి 41,575 పా యిం ట్ల వద్ద, నిఫ్టీ కూడా 119 పాయింట్ల లాభంతో 12,246 వద్ద ముగిసాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.35గా దాఖలైంది. ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, భారత్ పెట్రోలియం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లబ్ధి పొందా యి. యస్ బ్యాంక్, విప్రో, బ్రిటానియా ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఇన్ ఫ్రాటెల్ షేర్లు స్వల్పంగా నష్ట పోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం అదనపు మూలధనం ప్రకటించడంతో ఆయా రంగాల షేర్లు లబ్ధి పొందాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos