12వేల కి.మీ ప్రతిజ్ఞ యాత్ర

12వేల కి.మీ ప్రతిజ్ఞ యాత్ర

లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ‘కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర’’ అనే పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ‘మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’ అనేది దీనికి ఉప శీర్షిక. మొత్తం 12 వేల కి.మీ మేర సాగనున్న ఈ యాత్రతో బలాన్ని పెంచుకోవాలనేదిని పార్టీ యోచన. ఎన్ని కల హామీలను నెరవేర్చుకుంటామని ఓటర్లకు గట్టి భరోసా ఇవ్వటం కూడా యాత్ర ఆశయం. సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, కొందరు మరికొంత మంది నేతలు రాష్ట్ర వ్యా ప్తంగా పర్యటించి అనేక ప్రజా సమస్యలపై నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం ఎన్నికల ప్రణాళిక విడుదల కానుందని పార్టీ నేతలు తెలిపారు.

తాజా సమాచారం