బాపూ గురించి మాట్లాడే నైతికత భాజపాకు లేదు

బాపూ గురించి మాట్లాడే నైతికత భాజపాకు లేదు

లక్నో: గాంధీ బాటను అనుసరించిన తర్వాతే గాంధీ గురించి భాజపా మాట్లాడితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యా నించారు.గాంధీ 150వ జయంత్యుత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడ జరిగిన నిశ్శబ్ధ పాదయాత్రలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె కార్య కర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘గాంధీజీ ఆశయాలను తమ సిద్ధాంతాలుగా భాజపా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. సత్యం, అహింసలను గాంధీ జీ బోధించారు. సత్య పథాన్ని ముందు అనుసరించి ఆ తర్వాత గాంధీ గురించి భాజపా మాట్లాడితే సమంజసంగా ఉంటుంద’న్నారు. ‘మహి ళలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. వాటి పై గళం విప్పితే దారుణంగా అణిచి వేస్తున్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా కచ్చితంగా పోరాటాన్ని చేసి తీరుతా’మని చెప్పారు. ఢిల్లీలో జరిగిన పాదయాత్రకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లా డారు. అధికార దాహంతో తపించే పోయే వ్యక్తులు ఎప్పటికీ గాంధీని అర్ధం చేసుకోలేరని సోనియా నిప్పులు కురిపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos