మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఊహించిన విధంగానే తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉంది. ఆ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడ లేదు. దీంతో రాష్ట్రపతి పాలనకు కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. దీన్ని కేంద్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos