విద్యార్థుల ఆత్మహత్యపై రాష్ట్రపతి ఆగ్రహం..

విద్యార్థుల ఆత్మహత్యపై రాష్ట్రపతి ఆగ్రహం..

తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఉదాసీనత,జవాబు పత్రాలు మూల్యంకనం చేసిన గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం వల్ల కొద్ది రోజుల క్రితం 20 మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై రాష్ట్రపతి రామనాథ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు.మూల్యాంకనంలో ఇంటర్‌బోర్డు,గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 1 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్నాథ్ను కలిసి వినతి పత్రం అందజేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్.. తక్షణమే ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.ఇంటర్‌బోర్డు,గ్లోబరీనా సంస్థలు 25 మందికి పైగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణంగా నిలవడమే కాకుండా మరెంతో మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని.. మేరకు గవర్నర్ను ఆదేశించాలని బృంద సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.కాగా ఫలితాల్లో అవకతకవలపై ప్రభుత్వం ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీని నియమించగా  కమిటీ సైతం ఇంటర్ బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థదే తప్పంటూ తేల్చింది

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos