నిరసనతోనే జనస్వామ్యం పటిష్ఠమంతం

నిరసనతోనే జనస్వామ్యం పటిష్ఠమంతం

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను మరింత పటిష్ఠం చేస్తా యని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన భారత తొలి ఎన్నికల ప్రధా న కమిషనర్ సుకుమార్ సేన్ సంస్మరణ సభలో ప్రసంగించారు. ‘వాదోపవాదాలు, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య లక్షణాలు. భారత్లో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి చేసిన ప్రయత్నాల్ని పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో నియంతృత్వ ధోరణి క్రమంగా పాతుకుపోతుంది. రు. గత కొన్ని నెలలుగా ప్రజలు ముఖ్యంగా యువత తమ భావాలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదు ర్కొని నిలిచింద’ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నూతన పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక, ఎన్ఆర్పీ తదితర అంశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న దశలో ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించు కున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos