డార్లింగ్‌ అసలైన భాష ఇదీ..

  • In Film
  • January 24, 2020
  • 154 Views
డార్లింగ్‌ అసలైన భాష ఇదీ..

ఎప్పుడూ అభిమానులు,షూటింగ్‌లు,ప్రచారాల్లో ఉండడం వల్ల మన హీరోలు చాలా పద్ధతిగా మాట్లాడుతూ తెరపై కనిపించే తరహాలోనే బయట కూడా కనిపిస్తుంటారు.అయితే ఇవేమి లేనప్పుడు కేవలం స్నేహితులు లేదా ఆప్తులు మాత్రమే ఉన్నప్పుడు తమ అసలు బండారాన్ని బయట పెడుతుంటారు.అప్పుడు వాళ్లు మాట్లాడే తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయి.హీరోలమనే భావనను పూర్తిగా మరచిపోయి సామాన్యుల్లానే సంభాషిస్తుంటారు.తాజాగా ప్రభాస్ కూడా వీడియోలో అలా మాసీగా.. సాధా సీదా కుర్రాడిలా మాట్లాడడం కనిపించింది. పక్కా భీమవరంగోదారి యాస ఎలా ఉంటుందో వీడియో చూస్తేనే అర్థమవుతోంది.“ ఎదవకి చెప్పా నాకు చెప్పరా అని.. అయినా చెప్పకపోతే ఎలా?“ అంటూ ప్రభాస్ ఎంతో క్యాజువల్ గా మాట్లాడేసిన వీడియో ఒకటి ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ అవుతోంది. మావోడు పక్కా మాస్ అంటూ ఫ్యాన్స్ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. మొన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే ఈవెంట్లోని సన్నివేశమిది.తెరపై పాత్రను బట్టి సందర్భాన్ని బట్టి క్లాసీగా కనిపించొచ్చు కానీ.. లోన ఉన్న మాస్ మాత్రం ఇదిగో ఇలా బయటపడిపోతుంటుంది అంతే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos