ప్రణయ్ హత్య కేసులో 1,600 పేజీల ఛార్జ్‌షీట్‌..

ప్రణయ్ హత్య కేసులో 1,600 పేజీల ఛార్జ్‌షీట్‌..

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి విచారణ జరిపిన పోలీసులు దాదాపు 1,600 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ ప్రేమించుకున్నారు.ప్రణయ్‌ది తమకంటే తక్కువ కులం కావడంతో పెళ్లికి అమృత తండ్రి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదురించి ప్రణయ్‌,అమృతలు పెళ్లి చేసుకున్నారు.పెళ్లి అనంతరం ప్రణయ్‌,అమృతలు మిర్యాలగూడలోనే కాపురం పెట్టగా ఇక్కడ ఉండొద్దని ఎక్కడికైనా వెళ్లిపోవాలంటూ మారుతీరావు హెచ్చరించాడు.అయినప్పటికీ ప్రణయ్‌,అమృతలు అక్కడే ఉండడంతో సహించలేకపోయిన మారుతీరావు తమ్ముడు కొంతమంది కిరాయి హంతకుల ముఠాతో కలసి గత ఏడాది సెప్టెంబర్‌14వ తేదీన అమృతను ఆసుపత్రి నుంచి తీసుకువెళుతున్న ప్రణయ్‌పై దాడి చేయించాడు.దాడిలో ప్రణయ్‌ అక్కడిక్కడే మృతి చెందగా పరువు హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు 1,600 పేజీ ఛార్జ్‌షీట్‌ సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు.కాగా కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావుతో పాటు హత్యకు సహకరించిన నిందితులకు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos