తిరుమల నడక దారి మూసివేత

తిరుమల నడక దారి మూసివేత

భారీ వర్షాల కారణంగా రేపు (బుధవారం), ఎల్లుండి (గురువారం) తిరుమల కాలినడక మార్గాలను మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది.
17,18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధ, గురువారాల్లో అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలలో భక్తులకు అనుమతి నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు మెట్ల మార్గంలో జలపాతాన్ని తలపించేలా వరద ప్రవహించింది. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు నడక మార్గాలను మూసివేస్తున్నామని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
వర్షాల కారణంగా ఈనెల 12, 13 తేదీల్లోనూ రాత్రివేళ కనుమ రహదారులను తితిదే మూసేసింది. 12న రాత్రి 8 గంటల నుంచి 13న ఉ. 4గంటల వరకు మళ్లీ 13న రాత్రి 8 గంటల నుంచి 14న ఉ. 4 గంటల వరకు వాహనాలు అనుమతించలేదు. తిరుమలకు వెళ్లే పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో తితిదే అధికారులు కనుమదారులు మూసివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos