పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నిషేధించం

పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నిషేధించం

న్యూ ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నిషేధించే యోచన లేదని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టీకరించారు. గురువారం ఇక్కడ జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ 59వ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఆ వాహనాల వినియోగాన్ని నిషేధిస్తారనే భావన అందర్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించటం లేద’ని చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమ దేశ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. దేశంలో ఆటోమొబైల్ రంగం విలువ రూ. 4.50 లక్షల కోట్లు. దేశంలో కాలుష్యం పెరిగిపోతున్నందున కాలుష్యాన్ని వెదజల్లని ఇంధనం దిశగా వాహన తయారీ పరిశ్రమ అడుగులు వేయాల్సి ఉందన్నారు. వాతావరణ కాలుష్యానికి కేవలం వాహనాలే కారణాలుగా భావించ జాలమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos