‘చిదూ’కు నిద్ర లేని రాత్రి

‘చిదూ’కు నిద్ర లేని రాత్రి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీహార్చెరసాల్లో గురువారం మొదటి రోజు నిద్ర లేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించటంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆయన కుమారుడు కార్తీ నిరుడు పన్నెండు రోజులు గడిపిన ఏడో నంబరు గదిలోనే ఆయన్ని బంధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ గదిలో కొన్ని ప్రత్యేక సదుపాయాల్ని కల్పించారు.గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించేందుకు తలగడ, దుప్పటి అందించారు. శుక్రవారం ఉదయం గది బయట వాహ్యాళికి అనుమతిచ్చారు. అల్పాహారంగా అంబలి తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా గ్రంథాలయాన్ని వాడుకోవచ్చనీ, నిర్దేశిత వేళలో టీవీ చూడవచ్చని జైలు అధికారులు తెలిపారు. దినపత్రికల్నీ అందిస్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos