రోగుల ప్రాణాలతో ఆస్పత్రి చెలగాటం

రోగుల ప్రాణాలతో ఆస్పత్రి చెలగాటం

లక్ఖ్‌నవు:ఆగ్రా లోని ఆసుపత్రి ఆక్సిజన్ డ్రిల్’ పేరుతో కొవిడ్ రోగుల ప్రాణాలతో ఆడుకుంది. ఆక్సిజన్ కొరత ఉందని ఐదు నిమిషాల పాటు ఈ కసరత్తు చేసింది. దీని గురించి ఆసుపత్రి యజమాని వివరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రికి డా. అరింజయ్ జైన్ యజమాని. కరోనా కారణంగా గత ఏప్రిల్ నెలలో ఆసుపత్రికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తగిన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. ‘మాక్ డ్రిల్’ తరహాలో ‘ఆక్సిజన్ డ్రిల్’ నిర్వ హిం చారు సిబ్బంది. ఆక్సిజన్ సరఫరాను అర్ధంతరంగా నిలిపివేశారు. “ఆ సమయంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. మోదీనగర్లో అసలు ఆక్సిజనే లేదు. 96 మంది రోగులు ఉన్నారు. వారిని తీసుకెళ్లిపోవాలని వారి బంధువులను కోరాము. వారు నా మాట వినలేదు. అందుకే నేను ఓ మాక్ డ్రిల్ చేయాలనుకున్నా. ఏప్రిల్ 26, ఉదయం 7 గంటలకు.. ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాము. ప్రాణవాయువు అందక 22మంది విలవిలలాడిపోయారు. వారి శరీ రాల రంగులు కూడా మారిపోయాయి. ఆక్సిజన్ లేకపోతే వారు బతకరని అర్థమైంది. ఐసీయూలోని మిగిలిన 74మంది రోగుల కుటుంబాలకు సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని ఆదేశించామ’ని డా. అరింజయ్ జైన్ వివరించారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది పరిస్థితి విషమించింది. అయితే వీడియోలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునేందుకు ప్రయత్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos