ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​

ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​

ముంబై:బలవంతపు వసూళ్ల కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ గురువారం ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తునకు సహకరించేందుకుగాను చండీగఢ్ నుంచి ఆయన వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముంబయి విమానాశ్రయం నుంచి నేరుగా నేర విభాగం కార్యాలయానికి వెళ్లిన పరమ్బీర్ సింగ్ నుంచి గోరెగావ్ ఠాణాలో నమోదైన బలవంతపు వసూళ్ల కేసులో వాంగ్మూలం తీసుకున్నారు అధికారులు. బలవంతపు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు ఆదేశించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్గా ఉన్న పరమ్బీర్ సింగ్ను మహారాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా ఆఫీస్కు వెళ్లలేదు ముంబయికి వచ్చిన పరమ్బీర్ సింగ్పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పించారు. కోర్టు ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించి నందు వల్లే విచారణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని పరమ్బీర్ సింగ్ కోర్టుకు చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై తప్పుడు ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ప్రాణహాని ఉందని పరమ్బీర్ సింగ్ చెప్పడం తనకు షాకింగ్గా ఉందని హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అన్నారు. ముంబయి, ఠాణె పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నమ్మలేకపోతున్నాని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని, అందుకే రహస్యంగా తలదాచుకుంటున్నానని పరమ్బీర్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది న్యాయస్థానం.మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తనను నెలకు రూ.100కోట్లు వసూలు చేయమని ఆదేశించారని పరమ్బీర్ సింగ్ ఈ ఏడాది మేలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే హోంమంత్రి పదవికి దేశ్ముఖ్ రాజీనామా కూడా చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos