భయం గుప్పెట్లో దేశం విలవిల

భయం గుప్పెట్లో దేశం విలవిల

న్యూఢిల్లీ: దేశం భయం గుప్పెట్లో విలవిలలాడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. 106 రోజుల చెరసాల వాసం నుంచి బుధవారం విడుదలైన ఆయన గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి తన అభిప్రాయాల్ని నిర్భయంగా వ్యక్తీకరించారు. ‘అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా, అంతరాత్మపరంగా నా దాఖలా అత్యంత స్వచ్ఛమైనది. నాతో పనిచేసిన అధికారులు, నాతో మాట్లాడిన వ్యాపారవేత్తలు, నన్ను పరిశీలించిన జర్నలిస్టులకు ఆ విషయం బాగా తెలుసు. ఈ ప్రభుత్వం నా గొంతు నొక్క జాలదు. పార్ల మెంటులో మాట్లాడకుండా నన్ను ఆపజాలద’ని పేర్కొన్నారు.‘రాత్రి 8 గంటలకు నేను జైలు నుంచి బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చినప్పుడు నేను చేసిన తొలి ప్రార్థన 75 లక్షల మంది కశ్మీర్ ప్రజల కోసమే. 2019 ఆగస్టు 4 నుంచి వారు తమ ప్రాథమిక హక్కులకు నోచుకోలేదు. ప్రత్యేకించి ఎలాంటి అభియోగాలు లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధిం చటంనన్ను ఆందోళనకు గురిచేసింది. స్వేచ్ఛను ఎవరూ విభజించ లేరు. మనం మన స్వేచ్ఛను కాపాడుకోవాలంటే వాళ్ల స్వేచ్ఛ కోసం కూడా పోరాడాల’ని పిలుపునిచ్చారు. ‘ఆర్థిక వ్యస్థను భాజపా ప్రభుత్వం కుప్పకూల్చింది.5 శాతం వృద్ధిరేటుతో ఈ ఏడాది ముగిస్తే మనం అదృష్ట వంతులమే. డాక్టర్ అనవింద్ సుబ్రమణియన్ హెచ్చరికను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకో వాలి. ఈ ప్రభుత్వం చెబుతు న్నట్టు దేశ అసలు వృద్ధిరేటు 5 శాతం కాదు. 1.5 శాతం కంటే తక్కువేనని చెప్పార’ని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవ స్థపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను ఆయన మంత్రులకు వదిలేశారు. ఆర్థిక వేత్తలు చెప్పినట్టు ఆర్ధిక వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేద’ని పేర్కొన్నారు. ‘ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటి గురించి పట్టించు కోవడం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మూకదాడుల గురించి విలేకరులు ప్రశ్నించి నప్పు డు భావోద్వేగానికి గురయ్యారు. ‘కేంద్రం ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వం తప్పుడు విధానాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో మీడియా సహా అన్ని వ్యవస్థలూ భయాందోళనలో ఉన్నాయ’ని వ్యాఖ్యానిం చారు.తీహార్‌ జైలులో దిండు లేకుండా చెక్కబల్లపై నిద్రించడంతో మెడ, వెన్నెముక, తల మరింత దృఢ పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos