500 రాఫెళ్లు కొన్నా… భయపడం

500 రాఫెళ్లు కొన్నా… భయపడం

ఇస్లామా బాద్: సైన్యానికి ఖర్చు చేసే విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని, సైన్యానికి బడ్జెట్ కూడా అధికంగానే కేటాయిస్తోందని భారత్ ఐదు రాఫెల్ విమానాలు కొన్నా, ఐదు వందల రాఫెల్ విమానాలు కొన్నా భయపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్ శుక్ర వారం ఇక్కడ తేల్చిచెప్పారు.శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ ఫ్రాన్స్ నుంచి భారత్ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినా.. మేము భయ పడే ప్రసక్తే లేదు. అవసరమైతే తగిన జవాబిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాం. భారత్ ఐదు రాఫెళ్లను కొనుగోలు చేసినా. 500 రాఫెళ్లను కొనుగోలు చేసినా మేము మాత్రం ఎలాంటి ఆందోళన చెందం. భయపడం. మేము పూర్తి సంసిద్ధతతోనే ఉన్నాం. మా సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహాలూ లేవు.సైన్యం, రక్షణ కోసం పాకిస్తాన్ విపరీతంగా బడ్జెట్ కేటాయిస్తోందని కొందరు తమను ఆడిపోసు కుంటారు. గత పదేళ్లుగా రక్షణ రంగంపై కేటాయించే బడ్జెట్ తగ్గుతోంది. సైన్యానికి ఖర్చు చేసే విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. సైన్యానికి బడ్జెట్ కూడా అధికంగానే కేటాయి స్తోం ద’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos