వరి వేస్తే పసుపు వచ్చింది..

వరి వేస్తే పసుపు వచ్చింది..

తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి పేరుతో సన్న బియ్యం పండించాలనే పిలుపు మేరకు కొందరు రైతులు వేసిన వరి పంట వారి కొంప ముంచింది. రైతులు తమ దగ్గర సన్న బియ్యం విత్తనాలు లేకున్నా అప్పులు చేసి విత్తనాలు తెచ్చి అహర్నిశలు కష్టం చేసి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వరి కి బదులు వింతగా పసుపు గింజలు రావడం మొదలయ్యాయి. అది పరిశీలించిన రైతులు పంట చేలకు వెళ్లి చూడగా బియ్యం ఉండాల్సిన చోట పసుపు పచ్చ పౌడర్ లాగా ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధిక మొత్తం డబ్బులు పెట్టి విత్తనాలు కొనుక్కొని పంట వేస్తే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో నానక్ నగర్ రైతులకి ఈ పసుపు టెన్షన్ పట్టుకుంది. మాల్ పట్టి లేజర్ షాప్ లో వరి విత్తనాలు మందులు తీసుకొని వరి నాటు వేయగా ఒక పది పదిహేను రోజులలో చేయను చేతికి వచ్చే వేళ చిన్న చిన్న పసుపు కొమ్ములు మాదిరిగా ఒక రకంగా పంట రావడంతో అవాక్కయ్యారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోనా మసూరీ పండించాలని ప్రభుత్వం చెప్పిందని అదే పంట వేయగా ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పంటలు వేసినప్పటికీ మంచిగానే వచ్చిందని, ఈ విత్తనాలు వేయడం వలనే ఇలా వచ్చి ఉండవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos