అమిత్‌షా నిద్రపోతున్నారా?

అమిత్‌షా నిద్రపోతున్నారా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల జాబితాలో వేయి మంది రోహింగ్యాల పేర్లు చూపించాలని బీజేపీకి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితాలో కనీసం 30,000 నుంచి 40,000 మంది రోహింగ్యాలున్నారని భాజపా ఆరోపిస్తోందని దుయ్యబట్టారు. ‘సమాచార, ప్రసార శాఖ మంత్రి ఇక్కడకు వచ్చారు. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్ఎస్ లబ్ది పొందుతుందని చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని ఆరోపించారు. 30 వేల మంది రోహింగ్యాలు జాబితాలో ఉంటే, హోం మంత్రి అమిత్షా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారో చూడాల్సిన బాధ్యత ఆయనది కాదా?’ అని నిలదీశారు. బీజేపీకి నిజాయితీ ఉంటే, ఆ 1000 మంది రోహింగ్యాలు ఎవరో వెల్లడించాలని సవాలు చేశారు. విద్వేషం సృష్టించడమే వారి ఉద్దేశమని తప్పుపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos