పల్లెల్లో ఎనిమిది శాతం మందికే చదువు

పల్లెల్లో ఎనిమిది శాతం మందికే చదువు

న్యూఢిల్లీ : గ్రామాల్లో రోజువారీ ఆన్లైన్ తరగతులకు కేవలం 8 శాతం మంది మాత్రమే హాజరయ్యారని ఆర్థిక నిపుణులు జీన్ డ్రేజ్, రితికా ఖేరా, పరిశోధకుడు విపుల్ పైక్రా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం 37 శాతం మందికి ఆ అవకాశం లభించ లేదు. లాక్డౌన్ లో నాలుగింట ఒక వంతు మంది ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. 15 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల 1400 కుటుంబాల పై గత నెల్లో సర్వే చేసారు. వీరిలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల వారు.ఇందులోలో 60 శాతం మంది దళితులు, గిరిజన కుటుంబాలకు వారు. పట్టణ ప్రాంతాల్లో 24 శాతం మంది క్రమం తప్పకుండా ఆన్లైన్లో చదువు తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారిలో అది 8 శాతానికే పరిమితం. స్మార్ట్ ఫోన్ లేకపోవడం ప్రధాన కారణం. స్మార్ట్ఫోన్ ఉన్నా ఆన్లైన్లో చదువుకున్న వారు పట్టణాల్లో 31 శాతం. గ్రామాల్లో 15 శాతం. . స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ.. వినియోగించే విధానం తెలియకపోవడం అవరోధం. . గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు ఆన్లైన్ తరగతులకు అవసరమైన సామగ్రిని పంపలేదు. తల్లిదండ్రులకు వాటి గురించి తెలియదు. 1/5 వ వంతు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. మిగిలిన వారు ఆగస్టులో ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకునే ముందు ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని బకాయిలు తీర్చాల్సి వున్నందున ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని నివేదిక తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos