రహస్యాలను దాయడంలో మోడీని మించినోళ్లు లేరంతే

రహస్యాలను దాయడంలో మోడీని మించినోళ్లు లేరంతే

అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునేముందు – వాటిని ప్రకటించే ముందు అత్యంత రహస్యంగా ఉంచడంలో ప్రధాని మోదీని మించినోళ్లు లేరనే చెప్పాలి. నవంబర్ 8 వ తేదీ రాత్రి ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసినప్పుడు దేశం ఆశ్చర్యపోయింది. కలలో కూడా ఊహించని ప్రకటనతో రాజకీయ ప్రత్యర్హులకు,నల్ల ధనవంతుల కళ్లు బైర్లు కమ్మాయి. నకిలీ నోట్ల ముఠాలకు గట్టిగానే షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.
అత్యంత రహస్యంగా… పార్టీలో కానీ – అధికారుల్లో కానీ ఎవరికీ తెలియకుండా.. ఏ ఒక్క రోజూ ఎక్కడా సూచనప్రాయంగా కూడా అలాంటి సంగతి బయటకు పొక్కకుండా మోదీ ఒక్కసారిగా ఆ ప్రకటన చేశారు.

మళ్లీ ఇప్పుడు…

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించేవరకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ – నేతకు కానీ ఊహకు కూడా అందలేదు. మోదీ చేసిన ఈ ప్రకటనతో దేశంలోని పార్టీలు – నేతల అందరి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. చివరకు లోక్ సభలో ఈ బిల్లుకు మోదీకి బద్ధ శత్రువులుగా వ్యవహరించే పార్టీలు సైతం మద్దతివ్వాల్సి వచ్చింది. అలాంటి తురుపు ముక్క వేశారు మోదీ.

అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా బిల్లు విషయంలో కాంగ్రెస్ – బీఎస్పీ – ఆప్ వంటి పార్టీలన్నీ మద్దతివ్వాల్సి వచ్చింది. కాదంటే ఆ వర్గాల ఓట్లు దూరం చేసుకున్నట్లే. ఔనంటే మోదీ ఓట్ల కోసం వేసిన ఈ ఎత్తుగడకు మద్దతు పలికి ఆయనకు మేలు చేసినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ ఇరకాటంలో పడ్డాయి.ఇదంతా పక్కనపెడితే.. నోట్ల రద్దు కానీ – ఈ 10 శాతం కోటా ప్రతిపాదన కానీ రెండూ అనూహ్యం – అత్యంత రహస్యంగానే ఉన్నాయి.

మూడు కీలక రాష్ట్రాల్లో విజయం తరువాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈసారి ప్రధాని పీఠం నాదే అనుకుంటున్న సమయంలో మోదీ ఈ భీకరమైన షాట్ తో మ్యాచ్ ను మళ్లీ తనవైపు తిప్పుకొన్నారు. దీంతో రాహుల్ గాంధీ – ఆయన తల్లి సోనియాలకు నిద్రే కరువైన పరిస్థితి.

అయితే… మోదీ చేతిలో ఇంతలా చావుదెబ్బ తినడానికి కాంగ్రెస్ చేతకానితనమే కారణమని చెప్పుకోవాలి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా దశాబ్దాల కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీ ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తుందన్న విషయంలో సరైన అంచనాలు వేయలేకపోయింది. అంతేకాదు.. ప్రభుత్వ రహస్యాలు తెలుసుకోవడంలోనూ చొరవ చూపలేకపోయింది. ఇన్నేళ్లు పాలించినా తనకు అనుకూలమైన బ్యూరోక్రాట్లను తయారుచేసుకోలేకపోవడం వల్లే కాంగ్రెస్ ఇంతగా ఫెయిలైందని చెప్పుకోవాలి.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇంత దెబ్బ తగిలిన తరువాత ఇప్పుడు మోదీ వేయబోయే నెక్స్ట్ స్టెప్ గురించి కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారట. దేశంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తారా.. నిరుద్యోగ భృతి ఇస్తారా… యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ ఇక్కడా అమలు చేస్తారా.. ఏం చేస్తారు మోదీ అనుకుంటూ ఆలోచిస్తున్నారట. అయితే.. ఖజానాపై భారం మోపే ఇలాంటి పనులు మోదీ ఎందుకు చేస్తారన్న లాజిక్ మాత్రం మళ్లీ మరిచిపోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos