కరోనా కుదిర్చిన ప్రేమ..

కరోనా కుదిర్చిన ప్రేమ..

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి వైద్యులు,నర్సులు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమ ప్రాణాలను లెక్కచేకుండా రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. దీంతో కోలుకున్న రోగులు వైద్యులు నర్సులకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.యూఏఈకి చెందిన ఓ యువకుడు కరోనాతో కొద్ది కాలం క్రితం ఆసుపత్రిలో చేరాడు.అప్పటి నుంచి ఓ అందమైన నర్సు అతడికి సేవలు చేస్తూ కరోనా నుంచి కాపాడింది.చికిత్సలో భాగంగా ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. దీంతో తనకు సేవ చేసిన నర్సుకు ఒక రింగ్ తో అదే ఆస్పత్రిలో ప్రపోజ్ చేశాడు మహమ్మారి నుంచి కోలుకున్న యువకుడు. నర్సు కూడా యువకుడి ప్రేమకు కదిలిపోయింది. ఇద్దరూ ఆస్పత్రులోనే నిశ్చాతార్థం చేసుకున్నారు. చిత్రం హృదయాలను కరిగించే విధంగా ఉంది. పీపీఈ కిట్స్‌తో ఉన్న నర్సు కోలుకున్న మహమ్మారి యువకుడు అదీ ఆస్పత్రిలో ఒక్కటవ్వడం.. నర్సు ముసిముసి నవ్వులు చూడడానికే చాలా ప్రేమమయంగా ఉంది.. వీరిద్దరి ప్రేమ పిక్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos