మాక్స్ వెల్ బ్యాటింగ్ ఆర్డర్ పై బోర్డర్ అసంతృప్తి

  • In Sports
  • January 14, 2019
  • 212 Views
మాక్స్ వెల్ బ్యాటింగ్ ఆర్డర్ పై బోర్డర్ అసంతృప్తి

సిడ్నీ: పవర్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అలన్‌ బోర్డర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి సేవల్ని వృథా చేస్తున్నారని విమర్శించాడు. సాధారణంగా మాక్స్‌వెల్‌ను సందర్భాన్ని బట్టి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడిస్తుంటారు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం ఏడో స్థానంలో ఆడించారు. ఏడో స్థానంలో ఆడిన అతడు కేవలం ఐదు బంతుల్ని మాత్రమే ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో అతడు రెండు ఓవర్లు విసిరాడు.
‘ఆ స్థానంలో ఆడిస్తూ వృథా చేస్తున్నట్టు అనిపిస్తోంది’ అని బోర్డర్‌ అన్నాడు. ‘అతడిని ఇక ముందరైనా ఫించ్‌ హిట్టర్‌గా ఉపయోగించరని భావిస్తున్నా. ఆటలో పరిస్థితిని బట్టి మీకు మంచి ఆరంభం కావాలంటే అతడిని మూడో స్థానంలో ఆడించొచ్చు’ అని బోర్డర్‌ పేర్కొన్నాడు. వన్డేల్లో మాక్స్‌వెల్‌ అత్యధిక స్కోరు 102 పరుగులు. సగటు 30. బౌలర్‌గా 45 వికెట్లు తీశాడు. 4/46 అత్యుత్తమం. అద్భుత నైపుణ్యమున్న మాక్స్‌వెల్‌ నిలకడగా ఆడకోవడంతో చాలాసార్లు జట్టులో స్థానం చేజార్చుకున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos