9 మందిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్లు

9 మందిపై నాన్​ బెయిలబుల్​ వారెంట్లు

లఖ్నవూ : భాజపా లోక్ సభఢ సభ్యులు రీటా బహుగుణ జోషి, కాంగ్రెస్ నేతలు రాజ్బబ్బర్, ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు మరో ఆరుగురికి ఇక్కడి ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 2015 కి సంబంధించిన వ్యాజ్యం విచారణకు వీరంతా న్యాయ స్థానం ఎదుట హాజరుకానుందుకు ఈ ఆదేశాలిచ్చింది. నిందితులపై ఇప్పటివరకు వారెంట్లు ఎందుకు జారీ చేయలేదని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వోకు)కు తాఖీదులు జారీ చేసింది. 2015, ఆగస్టు 17న లక్ష్మణ్ మేళా వద్ధ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కూర్చున్న నాయకులు, 5 వేల మంది కార్యకర్తలు విధాన భవన్ వద్ద కు వెళ్లారు. వారు అక్కడ గుమిగూడకుండా ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినపుడు పరిస్థితి అదుపుతప్పింది. జరిగిన తొక్కిసలాటలో పోలీసు సిబ్బంది, పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. హజ్రత్గంజ్ పోలీసులు 19మందిని నిందితులుగా పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos