పోలీసుల అధీనంలోకి హజ్రత్ నిజాముద్దీన్

పోలీసుల అధీనంలోకి హజ్రత్ నిజాముద్దీన్

న్యూ ఢిల్లీ: ఇక్కడి వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం మంగళవారం ఇప్పుడు పోలీసుల స్వాధీనమైంది. అక్కడ దైవ ప్రార్థనలు చేసిన వారే కరోనా వ్యాప్తికి కారణమయ్యారని మర్కజ్ మౌలానాకు వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదిక దాఖలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించారు. ప్రార్థనల్ని చేసిన వారి వివరాలను వెల్లడించేందుకు మౌలానా నిరాకరించారు. ప్రార్థనల్ని చేసిన వారే కరోనా వైరస్ ను అంటించుకుని, తమ ప్రాంతాలకు వెళ్లారు. దేశంలో నమోదైన కాంటాక్ట్ కేసులన్నీ వీరి నుంచి వ్యాపించినవేనని తేలింది. ఢిల్లీ జాయింట్ పోలీసుల కమిషనరు డీసీ శ్రీవాత్సవ నేతృత్వంలోని బృందం నిజాముద్దీన్ వెళ్లి, అక్కడి 1200 మందిని క్వారంటైన్ చేసింది. ఈ ప్రాంతంలోని బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రవాలతో శుభ్రం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos