చరిత్రను ఎట్లా మారుస్తారు

చరిత్రను ఎట్లా మారుస్తారు

పాట్నా : ‘చరిత్రలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఎవరైనా దానిని ఎలా మారుస్తారు? ఒకవేళ మారుద్దాం అనుకున్నా. ఎలా మారుస్తారో నాకైతే అర్థం కావడం లేదు. భాష అనేది వేరే అంశం. చరిత్రలో ప్రాథమిక అంశాలను మార్చలేరు కదా!. చరిత్ర అంటే చరిత్ర.. అది ఎన్నటికీ మారదు.. ఏం చేసినా కూడా’’ అని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని తిరస్కరించారు. ‘చరిత్రకారులు కేవలం మొఘలుల మీద దృష్టిసారించి.. దేశంలోని మిగతా పాలకుల గొప్పతనం గురించి పుస్తకాల్లో చెప్పలేకపోయారని అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంకా ‘చరిత్ర అనేది ప్రభుత్వాల మీద ఆధారపడే అంశం ఎంతమాత్రం కాదు. వాస్తవాలకు తగ్గట్లుగా ఉండాలి. కాబట్టి, చరిత్రకారులు ఇప్పటికైనా మేల్కొని. చరిత్రలో చోటు దక్కని మన పాలకుల వైభవాన్ని గుర్తించి. చరిత్రను తిరగరాయాల’ని కోరారు. దీనికి స్పందిం చా లని విలేఖరులు కోరి నపుడు నితీశ్ మేరకు జవాబి చ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos