నేడు బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం

నేడు  బీహార్ సీఎంగా  నితీశ్  ప్రమాణం

పాట్నా: బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి, మహాఘట్ బంధన్లోకి వెళ్లిన నితీశ్ కుమార్ బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణం చేయనున్నారు. మంగళవారం గవర్నర్ ఫాగు చౌహాన్కు రాజీనామాను సమర్పించారు. 164 మంది ఎమ్మెల్యేల జాబితాను అందించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏడు పార్టీలు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కూటమి నూతన మంత్రి వర్గం ఇంకా ఖరారు కాలేదు. తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని, స్పీకర్ను ఆర్జేడీ నుంచి ఎంపిక చేస్తారన్న ప్రచారం ఉంది. తేజస్వి హోం శాఖను కూడా కోరుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ శాఖ నితీశ్ దగ్గర ఉంది. మహా కూటమిలోని ఇతర భాగస్వాములైన వామ పక్షాలు, కాంగ్రెస్ పా ర్టీలూ కొత్త ప్రభుత్వంలో స్థానాన్ని పొందనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos