నితీశ్‌ కు పదవి గండం

నితీశ్‌ కు పదవి గండం

పాట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేరని లోక్ జన్శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. సోమ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఏ క్షణంలోనైనా బీహార్లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చు. ప్రస్తుతం బీహార్లో పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. మహాకూటమి నేతలతో చేతులుకలిపి నితీష్ కుమార్ విజయ వంతంగా తన పదవిని 2025 వరకూ కాపాడుకో లేరు. మహా కూటమి నేతలకు అత్యుత్సాహం ఎక్కువ. అది మధ్యంతర ఎన్నికలకు దారితీస్తుంది” అన్నారు. బీహార్లోని ఎన్డీయే ప్రభుత్వంలో చీలక రానుందనే ఊహాగానాలతో పాటు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితీష్కుమార్ మంగళవారం కీలక సమవేశాన్ని నిర్వహించనున్నారు. , బీహార్లో అధికార జేడీయూ, బీజేపీ మధ్య పొత్తు తెగిపోనుందని పరిశీలకుల అంచనా. ఇదే జరిగితే ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రెంట్లతో పొత్తు పొట్టుకోవాలని జేడీయూ చూస్తోందనే ప్రచారమూ జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో కేంద్రంతో అంటీముట్టన్నట్టుగా నితీష్ వ్యవహరిస్తుండటం, ప్రధాని ఆదివారం నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొనకపోవడం వంటి పరిణామాలు జేడీయూ-బీజేపీ మధ్య వ్యవహారం చెడిందనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos