జర్నలిస్టులపై అణచివేత

జర్నలిస్టులపై అణచివేత

న్యూఢిల్లీ : దేశంలోని పాత్రికేయుల గొంతును కేంద్రం నొక్కి వేస్తోంది. కరోనా కట్టడిలో వైఫల్యాల్ని ఎండగట్టినవారిపై కక్షగట్టింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 50 మందికి పైగా పాత్రికీయులు పాలకుల కక్ష సాధింపులు గురయ్యారు. కొందరిపై అక్రమ కేసులు బనాయించారు. మరిందరిపై భౌతిక దాడులు జరిగాయి.కొందరు చెరసాల పాలూ అయ్యారు. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న స్వతంత్ర పాత్రికేయులు. వలస కూలీలకు ఆహారం దొరక్కపోవడాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా చూపించినందుకు కేసు నమోదు చేశారని హిమాచల్ ప్రదేశ్కు చెందిన పాత్రికేయులు ఓం శర్మ చెప్పారు. ‘కరోనా వ్యాప్తి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో పాటు తప్పుడు సమాచారాన్ని అందించారని నాపై అభియోగాలు మోపారు. పాత్రికేయులకుండే స్వేచ్ఛను పూర్తిగా హరించేసారు. కర్ఫ్యూ పాస్ ఇచ్చేందుకు అధికార్లు తిరస్కరించడంతో ఇంటి నుంచే పని చేసుకోవడం మొదలు పెట్టా. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యల్ని తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరిన’ట్లు తెలిపారు. శర్మతో పాటు ఇతరులపై నమోదైన కేసులనూ ఉపసంహరించుకోవాలని పాత్రికీయులు భద్రత సమితి చేసిన వినతికి ముఖ్యమంత్రి అంగీకరించారు. జమ్ము- కాశ్మీర్లో విలేఖరుల పై భౌతిక దాడులు జరిగాయి. లాక్డౌన్ సమయంలో కాశ్మీర్లో స్థితిగతులను విలేఖనం చేసిన శ్రీనగర్ విలేఖరి ముస్తక్ అహ్మద్ గన్నీపై అక్రమ కేసు బనాయించారు. 123 ఏళ్ల కిందటి అంటు వ్యాధుల నివారణ చట్టం కింద అభియోగాలు మోపి 48 గంటల పాటు జైలులో బంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos