ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తిరస్కరించిన బాలయ్య

ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తిరస్కరించిన బాలయ్య

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ – తలైవి లో ఎన్టి.రామా రావు పాత్ర పోషించేందుకు నటుడు బాలకృష్ణ నిరాకరించినట్లు సినీ వర్గాల కథనం. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ప్రధానమైన పాత్రలో కంగనా రనౌత్, అరవింద్ స్వామి , ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. జయలలిత, ఎన్టీ రామారావు కలిసి కొన్ని సినిమాల్లో నటించినందున ఈ సినిమాలో ఎన్టీ రామారావు పాత్ర కూడా వుంది. ఆ పాత్రను బాలకృష్ణతో చేయిస్తే బాగుంటుందని నిర్మాత విష్ణు ఇందూరి భావించాడు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఆయన ఒకరు. ఆ సాన్నిహిత్యంతోనే ఆయన బాలయ్యను సంప్రదించాడట. అయితే బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos