హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్కు కూడా నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. పోలీసులకు అందుబాటు లోనే ఉన్నానని నవదీప్ గురువారం తెలిపిన విషయం విధితమే. మరోవైపు షాడో సినిమా యూనిట్మెన్ ఉప్పలపాటి రవి ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
పలు పబ్బులపైనా నార్కోటిక్ పోలీసుల నిఘా పెట్టారు. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల గాలిస్తున్నారు. కేపీ చౌదరి లిస్ట్లోనూ మోడల్ శ్వేతా పేరు ఉండడం గమనార్హం. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేటాడుతున్నారు. కేపీ చౌదరి లిస్ట్తో పాటు గతంలో బెంగళూరు డ్రగ్స్ కేస్లోనూ కలహార్ రెడ్డి పేరు ఉండడం గమనార్హం

తాజా సమాచారం

Latest Posts

Featured Videos