కేశినేని వైఖరితో బాబుకు షాక్‌

కేశినేని వైఖరితో బాబుకు షాక్‌

న్యూ ఢిల్లీ : చంద్రబాబుపై లోక్సభ సభ్యుడు కేశినేని నాని అసహనాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు ముందే విభేదాలు బయట పడ్డాయి. శనివారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఎదుటే కేశినేని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పుష్ప గుచ్చాన్ని ఇచ్చేందుకు నిరాకరించారు. దాన్ని ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలినా కూడా కేశినేని లెక్కచేయలేదు. చంద్రబాబు పక్కన నడిచేందుకూ ఇష్టపడ లేదు. కేశినేని వైఖరికి చంద్రబాబు నిర్ఘాంతపోయారు. ఇటీవల కేశినేని నాని సోదరుడిని చంద్రబాబు ప్రోత్స హిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో ఈ విషయంపై కేశినేని వాగ్వాదం జరిగింది. తన తమ్ముడిని ప్రోత్సహించడంపై కేశినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos