ఈ ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలు..

  • In Tourism
  • September 25, 2019
  • 408 Views
ఈ ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలు..

చారిత్రాత్మక,ఆధ్యాత్మిక,ఇతిహాస ఘట్టాలకు,కట్టడాలకు కేంద్రంగా భారతదేశం విరాజిల్లుతోంది.వీటితో పాటు అందమైన ప్రదేశాలు అంతకంటే ఆశ్చర్యం,భయంకరమైన ప్రదేశాలు కూడా భారతదేవంలో అనేకం ఉన్నాయి.వాటిలో కొన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో జాబితాను ఒక్కసారి చూడాల్సిందే.అయితే అవి వాస్తవాలో లేక అభూత కల్పనలో అనే విషయాన్ని మాత్రం మేము స్పష్టంగా చెప్పడంలేదు.
బ్లాక్ మ్యాజిక్ కు అడ్డాగా అస్సాం:
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం ప్రకృతి అందాలకు ఎంత ప్రసిద్ధో బ్లాక్‌మ్యాజిక్‌కు కూడా అంతే ప్రసిద్ధి చెందింది.జిల్లాలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున దట్టమైన అడవుల్లో అనేక వన్యప్రాణులకు నిలయంగా ఉంటూ పర్యాటకంగా,సాంస్కృతికంగా విరాజిల్లుతున్న మయాంగ్‌  భారతదేశంలోనే ఎక్కువగా మంత్ర విధ్యలను ప్రదర్శించే ప్రదేశంగా ప్రసిద్ది చెందింది..

సాందర్భిక చిత్రం..

హాంటెడ్ భాన్గర్ కోట :
రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న సరిస్క రిజర్వు సరిహద్దుల్లో ఉన్న భన్గర్‌కోట అత్యంత ప్రమాదకరమైన,రహస్యమైన ప్రాంతంగా పేరుగాంచింది.భారత పురాసవ్తు శాఖ అధికారులే స్వయంగా కోట గేటుకు సూర్యాస్తమయం
తర్వాత మరియు సూర్యోదయానికి ముందు ప్రవేశం నిషేధం అనే బోర్డు పెట్టారంటేనే ఈ కోట ఎంత ప్రమాదకరమో,భయంకరమో ఊహించుకోవచ్చు.ఈ కోటలోకి వెళ్లడం కాదు చూస్తేనే ఒళ్లు గగుర్పొడస్తుంది.

హాంటెడ్ భాన్గర్ కోట

హైడ్ అండ్ సీక్ బీచ్ :
ఓడిషా ఓడిశాలో బలేశ్వర్ జిల్లాలో చండీపు సముద్ర తీరం హైడ్ అండ్ సీక్ బీచ్ గా బాగా ప్రసిద్ది చెందింది.చాలా కాలం ఈ బీచ్‌లో కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో కనిపించకుండా పోయారని మరికొంత మంది గాలిలోకి కలసిపోయారని చెబుతుంటారు. బీచ్ లో మానవాతీత చర్యలు అనేకం జరుగుతాయని కూడా స్థానికులు విశ్వసిస్తున్నారు.

హైడ్ అండ్ సీక్ బీచ్

హ్యాంగింగ్ పిల్లర్ :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక దర్శనీయ ప్రదేశాల్లో అనంతపురం జిల్లాలోని లేపాక్షి కూడా అత్యంత ప్రముఖమైనది.లేపాక్షిలోని ప్రతి కట్టడం,ప్రతి శిల్పం అత్యద్భుతమే.అన్నిటికంటే లేపాక్షిలోని వేలాడే స్థంబం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేస్తోంది.లేపాక్షిలో వీరభాద్రేస్వరుడి దేవాలయంలో ఉన్న వేలాడే స్థంబం ఆలయం పైకప్పు ఆధారంగా గాలిలో వేలాడుతుంటుంది. క్రి. . 16 శతాబ్దం నాటి శిల్పం ఇది అని చెపుతారు. వేలాడే స్థంభం ఆనాటి శిల్పకళ నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

హ్యాంగింగ్ పిల్లర్

స్థంబేశ్వర టెంపుల్:
రోజులో కొద్ది గంటలు కనిపంచి అంతలోనే మరికొన్ని గంటలు కనిపించకుండాపోయే ఆలయం ఒకటుందంటే నమ్ముతారా?కానీ ఇది నిజంగా ఉంది.గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదర సమీపంలోని అరేబియా సముద్ర తీరాన ఉన్న స్థంబేశ్వర శివాలయం కొద్ది గంటలు కనిపించి మరికొద్ది గంటలు నీటిలో మునిగి కనిపించకుండా పోతుంది.అరేబియ సముద్ర తీరానా ఉన్న ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. సముద్రపు అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే లోపలికి ప్రవేశించాలి. మిగిలిన సమయాల్లో సముద్రపు నీటితో ఆలయం పూర్తిగా నీటి మునిగి ఉంటుంది. తర్వాత మళ్లీ కొన్ని గంటల తర్వాత కనబడుతుంది. దైర్యం చేసి ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పరమేశ్వరుని ఆశిస్సులు తప్పక లభిస్తాయని భక్తుల నమ్మకం.

స్థంబేశ్వర టెంపుల్

కవలల గ్రామం:
ప్రకృతి అందాలు,పదుల సంఖ్యలో నదులు,ఎటు చూసినా కొబ్బరిచెట్లు,సంస్కృతి,సంప్రదాయాలతో అలరారుతూ దేవుళ్ల భూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం మరో వింతకు కూడా పేరు గాంచింది.అదే కవలల గ్రామం.
కేరళ రాష్ట్రంలోని మలప్ఫురం జిల్లాలోని తిరురంగడికి సమీపంలో కొడిని గ్రామంలో రెండు వేల కుంటుంబాలున్నాయి. ప్రపంచంలో కవలలు అధికంగా ఉన్న ప్రదేశాల జాబితాలో కోడిని గ్రామం కూడా ఉంది .ఇక్కడ జంటలకు పిల్లలు ఎపుడూ కవలలుగానే పుడతారు.కాగా నైజీరియా లోని ఇగ్బోఆరా ప్రదేశంలో కూడా ఇదే విధంగా జరుగుతోందని తెలుసుకున్న కొంతమంది పరిశోధకులు కోడినిహి గ్రామస్తుల మరియు ఇగ్బోఆరా ప్రజల మధ్య ఏదైనా సంబంధం ఉందేమోనని పరిశోధించారు.అయితే రెండు ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్య ఎటువంటి సంబంధం లేదని కనీసం రకమైన తిండి అలవాట్లు కామన్ గా లేవని కూడా తెలుసుకున్నారట..

కొడిని గ్రామంలో కవలలు

అత్యంత స్వచ్ఛమైన గ్రామం:
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ఏవిధంగా చూసినా చాలా తక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది.అప్పుడప్పుడు భారీ వర్షాలు,వరదలతో మాత్రమే వార్తల్లో నిలిచే మేఘాలయలో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశాలు ఉన్నాయి.మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు కాశీ హిల్స్ మాల్లీనాంగ్ గ్రామం. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుగాంచింది.అంతేకాదు మేఘాలయాలోని డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ వంతెన చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో మేఘాలయాలో ఉన్న రబ్బరు చెట్టు వేర్లు ఒక వంతెనలా పెరగడం సస్పెన్స్ గా ఉంటుంది.

 

మాల్లీనాంగ్ గ్రామం

డబుల్ డెక్కర్ లివింగ్ రూట్

టెంపుల్ అఫ్ రాట్స్:
చారిత్రాత్మక కట్టడాలకు నిలయమైన రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో ఉన్న కర్ని మాతా ఆలయంలో ఎలుకలను కూడా పూజించడం ప్రత్యేకత.కర్ని మాతకు అంకితం చేయబడ్డ ఈ ఆలయంలో సుమారు ఇరవై వేలకుపైగా నల్ల ఎలుకలతో పాటు కబ్బలు అని పిలవబడే తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. ఇవి మనుష్యులకు ఎలాంటి హాని చేయవు. స్థానికులు ఎక్కువగా ఆలయాన్ని సందర్శిస్తుంటారు..

కర్ని మాతా ఆలయం

ఒక్క ఇంటికీ తలుపులు ఉండవు:
మహారాష్ట్రలో శని శింగనాపూర్ గా పిలవబడుతున్న గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు. శనిమహాత్మకు ప్రసిద్ది చెందిన ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ దొంగతనాలు, బందిపోటుల సమస్య ఏమాత్రం ఉండదు. గ్రామానికి శనిమాహాత్మ స్వామి కాపాలగా ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. కారణం చేతనే ప్రదేశం పర్యాటక ప్రదేశంగా , ఆధ్యాత్మిక ప్రదేశంగా బాగా ప్రసిద్ది చెందినది.

శని శింగనాపూర్ గ్రామంలో తలుపులు లేని ఇళ్లు..

చౌరఘర్ శివ టెంపుల్ :
తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కూడా ఉన్నో ఆధ్యాత్మిక,చారిత్రాత్మక ప్రాంతాలకు నిలయంగా భాసిల్లుతోంది.మధ్యప్రదేశ్‌లోని పంచమరికి సుమారు 1,326 మీటర్ల ఎత్తులో ఉండే చౌరఘర్ శివాలయం ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రం .ఇంత ఎత్తులో ఉన్న ఈ శివాలయంలో వేలాది సంఖ్యలో త్రిశూలాలు ఉండడం మిస్టరీగా మారింది..

చౌరఘర్ శివ టెంపుల్

అస్థిపంజరాల సరస్సు:
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో హిమాలయాలకు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌ ఖండ్‌ సరస్సులో వందలాది అస్థిపంజరాలు ఉండడం విస్మయగానికి గురి చేస్తోంది.దశాబ్దాలుగా రూప్ ఖండ్‌ సరస్సుల్లో అస్థిపంజరాలు ఉన్నట్లు గుర్తించారు.అయితే
ఇవి ఎప్పటివో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ మిస్టరీ లేక్‌గా ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందినది.

అస్థిపంజరాల సరస్సు

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos