మొతేరా స్టేడియం లోపల ఎలా ఉందో చూశారా?

మొతేరా స్టేడియం లోపల ఎలా ఉందో చూశారా?

ప్రధాని నరేంద్రమోదీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల చేతుల మీదుగా ఆవిష్కృతమైన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్‌ నగరంలోని మొతేరా స్టేడియం లోపల ఇంద్రభవనానికి ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉంది.63 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ ప్రఖ్యాత స్టేడియంలను తలదన్నేలా దీన్ని నిర్మించారు. మొతేరా స్టేడియంలో ఒకేసారి లక్ష 10 వేల మంది కూర్చుని మ్యాచ్ చూడవచ్చు.ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా  ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమం కోసం స్టేడియాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేయగా అందుకు సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్టేడియం ఫోటోలు ట్వీట్ చేశారు.సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos