నల్ల మచ్చలను నివారించే నాలుగు చిట్కాలు

నల్ల మచ్చలను నివారించే నాలుగు చిట్కాలు

ముఖం మీద నల్ల మచ్చలతో యువతులు సతమతమవుతుంటారు. రోజూ అద్దం ముందు నిలబడి బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఇంటిలో లభించే వాటితోనే నల్ల మచ్చలను మాయం చేసుకోవచ్చు. కలబంద మధ్యలో ఉండే జెల్‌ లాంటి చిగురును నల్ల మచ్చలు ఉన్న చోట మర్దన చేసి కాసేపు ఆరనివ్వాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాదు నల్ల మచ్చలు మాయమవుతాయి. కోడి గుడ్డు అనేక ఖాయిలాలను మాన్పించే చక్కటి చిట్కా. గుడ్డులోని పసుపు పచ్చ సొనను పక్కకు తొలగించి, కేవలం తెలుపును మాత్రమే ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే నల్ల మచ్చలు మటుమాయం. ముఖాన్ని కాంతివంతంగా ఉంచే గుణం టొమాటోకు ఉంది. ముఖంపై ఉండే నల్ల మచ్చలను కూడా నిర్మూలిస్తుంది. వారంలో రెండు సార్లు టమోటాతో మర్దన చేసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. నిమ్మకాయ కూడా నల్ల మచ్చలను సులభంగా తొలగిస్తుంది. నల్ల మచ్చలు ఉండే చోట నిమ్మ రసం లేదా నిమ్మ బద్దలతో మర్దన చేస్తే సత్ఫలితాలుంటాయి. రోజూ ఇలా చేయడం మంచిది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos